రుద్రూర్, బతుకమ్మ : జేఈఈ మెయిన్స్ లో రుద్రూర్ గ్రామ విద్యార్థి చిదుర శ్రీనిక్ సత్తా చాటాడు. రుద్రూర్ మండల కేంద్రంలో నివసిస్తున్న దుస్తుల వ్యాపారి చిదుర హరీరాం, కవితల కుమారుడు చిదుర శ్రీనిక్. 10వ తరగతి నవోదయలో చదివి 92.6% మార్కులు సాధించారు. అదేవిధంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఆల్ ఇండియాలో 3754 ర్యాంక్ సాధించాడు. ఈసందర్భంగా శ్రీనిక్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.