వరి పంటలను సందర్శించిన రుద్రూర్ శాస్త్రవేత్తలు
రుద్రూర్, బతుకమ్మ : వరి పంట పూత దశ నుండి గింజ కట్టే దశలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. రుద్రూర్ మండలంలోని పలువురు రైతు పంట పొలాలను శుక్రవారం ప్రాంతీయ చెఱకు, వరి పరిశోధన స్థానం రుద్రూరు శాస్త్రవేత్తల బృందం సందర్శించారు. కొంత మంది రైతు పొలాలలో బాక్టీరియా ఎండాకు తెగులు ఉందన్నారు. బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఎక్కువ శాతం దుబ్బు చేసే దశ నుంచి చిరు పొట్ట దశ లో ఉన్న వరి పంటలు ఆశించే అవకాశం ఉంటుందిని, ఈ తెగులు ఆశించినప్పుడు...