రుద్రూర్, బతుకమ్మ : వరి పంట పూత దశ నుండి గింజ కట్టే దశలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. రుద్రూర్ మండలంలోని పలువురు రైతు పంట పొలాలను శుక్రవారం ప్రాంతీయ చెఱకు, వరి పరిశోధన స్థానం రుద్రూరు శాస్త్రవేత్తల బృందం సందర్శించారు. కొంత మంది రైతు పొలాలలో బాక్టీరియా ఎండాకు తెగులు ఉందన్నారు. బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఎక్కువ శాతం దుబ్బు చేసే దశ నుంచి చిరు పొట్ట దశ లో ఉన్న వరి పంటలు ఆశించే అవకాశం ఉంటుందిని, ఈ తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద అంచుల వెంబడి అలల మాదిరిగా నీటి రంగు డాగు మచ్చలు ఏర్పడతాయాన్నారు. అనంతరం రైతులకు పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. యాజమాన్య చర్యలు : తొలిదశలో గనక గుర్తించినట్లయితే వ్యాప్తిని నివారించడానికి మాత్రం రాగి దాతు శీలింద్ర నాశనం అయినటువంటి కాపర్ హైడ్రాక్సైడ్ అనే ఒక మందును ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు తో పాటుగా స్ట్రీప్టో మైసిన్ సల్ఫేట్ లేదా ప్లాంటో మైసిన్ అనే బ్యాక్టీరియా శిలీంద్ర నాశిని 0.4 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి ఎక్కడైతే వరి పంట పూత దశలో ఉంటుందో బ్యాక్టీరియా తెగులు లక్షణాలు గమనించినట్లయితే మాత్రం ఈ రాగిదాతు శిలీంద్ర నాశనులను పిచికారీ చేయవద్దు. ముఖ్యంగా చిరు పుట్ట దశలో ఈ తెగులు తట్టుకునే శక్తిని పెంపొందించడం కొరకు మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ఎకరానికి 15 నుంచి 20 కేజీలు వేసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా లక్షణాలు తట్టుకునే శక్తిని కూడా మొక్క గ్రహిస్తుంది . అదే విధంగా కొంత మంది రైతు పొలాలలో కాండం తొలుచు పురుగు ఉధృతి ని గమనించడం జరిగింది, అంకురం నుండి చిరు పొట్ట దశ లో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్ల కంకులు బయటకు వస్తాయి. ఈ పురుగు నివారణ కు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్.పి 2 గ్రాములు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 18.5 ఎస్.సి 0.3 మి.లీ, లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా రైతులు సరైన సమయంలో చీడపీడలను గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చుని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిపతి డా. సమతా పరమేశ్వరి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.