Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2025, 1:25 pm Posted by : ramakrishna

భారత సైన్యంలో ’రుద్ర‘ దళం

వెబ్ న్యూస్, బతుకమ్మ : శత్రువుల ఆటకట్టించేందుకు భారత సైన్యంలో ’రుద్ర‘ పేరిట శక్తివంతమైన దళం ఏర్పాటయింది. భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేలా ’ఆల్ ఆర్స్మ్  బ్రిగేడ్‘ ను ఏర్పాటు చేసినట్లు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.  శనివారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆయన అమరవీరులకు నివాళులు అర్పించారు. పదాతి దళం, యాంత్రిక పదాతి దళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి దళం, ప్రత్యేక దళాలు, మానవ రహిత వైమానిక వ్యవస్థలు వంటి వ్యవస్థలతో కూడిన రుద్ర దళాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సరిహద్దుల్లోని శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేందుకు ’భైరవ్‘ అనే లైట్ కమాండో బెటాలియన్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఇప్పటికే రెండు పదాతిదళ బ్రిగేడ్లు  రుద్ర లో భాగమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.