ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ను కలిసిన ఆర్టీఐ ప్రతినిధి
బతుకమ్మ, భిక్కనూరు: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కాసిం ను శుక్రవారం జిల్లా ఆర్టిఐ ప్రతినిధి గంగల రవీందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ సౌత్ క్యాంపస్ లో న్యాయవిద్య కోర్సును ప్రవేశపెట్టాలని వారికి తెలియజేయగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో స్వామి, ప్రణతి శుభశ్రీ, రాజు, రమేష్, భాను ప్రకాష్ తదితరులు ఉన్నారు.