ప్రైవేట్ స్కూళ్లలో ఆర్టీఈ అమలు చేయలేం

నిజామాబాద్, బతుకమ్మ: పెండింగ్ లో ఉన్న బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని, ఇక ముందు తాము రైట్ టు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ (ఆర్టీఈ) అమలు చేయలేమని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయా జిల్లాల కలెక్టర్ లకు అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రాలు అందజేశారు. ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులకు 25శాతం ఉచితంగా సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని ట్రస్మా స్పష్టం చేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లు ఉచిత విద్యను అందించే...