. . . ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ నాయకుల వినతి
. . . ప్రభుత్వం 29 డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించింది
. . . నగర కార్పొరేషన్ డిసిసి అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని, కార్మికులు సమ్మె విరమించాలని నగర కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రం లోని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింప చేసేలా వారితో చర్చలు జరపాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి తో కలిసి బుధవారం ఆర్టీసీ ఉద్యోగుల దగ్గరికి సమ్మె విరమించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు చెప్పిన 32 డిమాండ్లలో ఇప్పటికే 29 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, మిగిలిన మూడు డిమాండ్ లను కూడా త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నెరవేర్చే ప్రయత్నం చేస్తారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మీ పాత్ర ఎంతో ఉందని, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆర్టీసీ ఇబ్బందుల్లో లేదు కానీ తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగి అన్ని సంస్థలను నిర్వీర్యం చేసిందని, ఆర్టీసీ సంస్థను కూడా తెరాస అప్పులోకి లాగిందని, దానిని తీవ్ర స్థాయిలో నష్టపరించిందని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు సమ్మె చేస్తామని ప్రకటించిన వెంటనే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 6 గంటల్లోనే చర్చలకు మీవద్దకు వచ్చామని తెలిపారు. ఆర్టీసీ పై మాకు ఉన్న బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వెంకట్రావు రెడ్డి, గోపి గాదరి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, జిల్లా సేవాదల అధ్యక్షులు సంతోష్, కార్పొరేటర్లు అన్వార్, ఆదిత్య, ప్రవీణ్ గౌడ్, మనోహర్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెయిన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
