జుక్కల్ బస్టాండ్‌లో ఆటోల నిలుపుదలపై ఆర్టీసీ హెచ్చరిక
జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ ఆర్టీసీ బస్టాండ్‌లో అనుమతి లేకుండా ఆటోలు నిలుపుదల చేస్తున్న ఘటనలపై ఆర్టీసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. బస్టాండ్ ప్రాంగణంలో ఎటువంటి అనుమతి లేకుండా ఆటోలు నిలబడరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రయాణికుల వివరాల ప్రకారం, బస్టాండ్‌లో ఆటోలు నిలుపుదల చేయడం వల్ల ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని సందర్భాల్లో బస్సులు బస్టాండ్‌లోకి ప్రవేశించే సమయంలో ఆటోలు అడ్డుగా నిలవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వారు తెలిపారు....