ఆర్టీసీ సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
కామారెడ్డి, బతుకమ్మ : టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కామారెడ్డి డిపో ఆధ్వర్యంలో ఈనెల మే 7 తేదీన మొదటి డ్యూటీ నుండి జరుగు సమ్మెను జయప్రదం చేయాలని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ వెంకట గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలియం చేయాలని, ట్రేడ్ యూనియన్ లపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2017 సంవత్సర వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, కొత్త అలవెన్స్లు అమలు చేయాలని, రిటైర్డ్ అయిన...