Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2025, 5:36 pm Posted by : ramakrishna

ప్రజల వద్దకే ఆర్టీసీ సేవలు 

  • బస్టాండ్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం
  • ప్రయాణికులు వినియోగించుకోవాలి : డిఎం ఆనంద్

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి ఆర్టీసీ  బస్టాండు ప్రయాణ ప్రాంగణంలో శుక్రవారం డిపో మేనేజర్ ఆనంద్ ఆధ్వర్యంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ ఇందల్వాయి ఆర్టీసీ బస్టాండ్ ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని  దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. అవగాహనలో భాగంగా ప్రయాణికులకు బస్టాండ్ ఆవరణలో ఎలాంటి  ఇబ్బందులు కలగకుండా బాత్రూం సౌకర్యాలు,లెట్రిన్ సమస్యలు తలెత్తకుండా పరిశుభ్రతతో బస్టాండ్ ని ఆదర్శంగా తీర్చు దిద్దుతానని తెలిపారు.ప్రతిష్టాత్మకంగా ప్రజల వద్దకు ఆర్టీసీ అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరూ వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సు ప్రయాణం సేవలను వినియోగించుకోని  సురక్షంగా తమ గమ్యాలను చేరుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.