Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 12:27 pm Posted by : ramakrishna

ఆర్టీసీ నూతన బస్ సర్వీసులను ప్రారంభించిన పోచారం

బాన్సువాడ,బతుకమ్మ : బాన్సువాడ ఆర్టీసీ డిపోకు కేటాయించిన రెండు కొత్త ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులను శనివారం డిపో వద్ద  ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్  కాసుల బాలరాజు జెండా ఊపి ప్రారంభించారు.  నిజామాబాద్ నుంచి జహీరాబాద్ (వయా బోధన్, బాన్సువాడ, నిజాంసాగర్ )మరియు, బాన్సువాడ నుంచి నారాయణఖేడ్ (వయా పిట్లం, నిజాంపేట్) మార్గాల్లో ప్రయాణికులకు ఈబస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు.  తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో.. మహిళలు, విద్యార్థినుల ప్రయాణాలు బాగా పెరిగాయి.  మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో బాన్సువాడ డిపో మేనేజర్ ఆర్ సరిత దేవి, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


RTC launches new bus services in Pocharam