ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్-1 డిపో ఆవరణలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో ముందు ఏర్పాటు చేసిన యూనియన్ జెండాను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు యూనియన్ చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు. అనంతరం గ్యారేజ్ విభాగానికి చెందిన దీపక్‌తో పాటు పలువురు ఉద్యోగులు భారీ సంఖ్యలో ఎంప్లాయిస్ యూనియన్‌లో చేరారు....