Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 6:18 pm Posted by : ramakrishna

ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్-1 డిపో ఆవరణలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో ముందు ఏర్పాటు చేసిన యూనియన్ జెండాను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు యూనియన్ చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు. అనంతరం గ్యారేజ్ విభాగానికి చెందిన దీపక్‌తో పాటు పలువురు ఉద్యోగులు భారీ సంఖ్యలో ఎంప్లాయిస్ యూనియన్‌లో చేరారు. కొత్తగా చేరిన సభ్యులను నాయకులు శాలువాలతో సత్కరించి యూనియన్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ రీజియన్ కార్యదర్శి సాయిలు, రాష్ట్ర కార్యదర్శి డి. సంజీవ్, డిపో కార్యదర్శి లింబాద్రి, దీపక్, జే.ఎల్. రెడ్డి, కే.ఎం. రెడ్డి, భోజన్న, లక్ష్మణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.