నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ 2 బస్ డిపోకు చెందిన డ్రైవర్ ఆర్మూర్ బస్ స్టాండ్ వద్ద గురువారం ఆత్మహత్య యత్నం చేశారు. నిజామాబాద్ నుండి నిర్మల్ వెళ్తుండగా మార్గమధ్యలో ఆర్మూర్ లో ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో డ్రైవర్ ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ ఖమ్మం జిల్లా సతిపల్లికి చెందిన షేక్ ఇమాం సాహెబ్ గా గుర్తించారు. మూడు నెలల కోసం నిజామాబాద్ 2 డిపోకు తీసుకొచ్చి మూడేళ్లు గడిచిన సొంత డిపోకు పంపకపోవడంతో మానసిక క్షోభకు గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.