ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

  . . . ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి   ఆర్మూర్, బతుకమ్మ :   ప్రభుత్వం కల్లాల్లో ఉన్న మక్కలు, వడ్లు వెంటనే కొనాలి అని అన్నందుకు ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను ఉద్యోగం నుండి తొలగించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలను ప్రస్తావించినందుకు ఒక సాధారణ ఆర్టీసీ డ్రైవర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. రైతులు...