వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు

వరంగల్,బతుకమ్మ :  వరంగల్ నగరంలో  శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో ఆదివారం ఉదయం వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు వచ్చింది. ఆమార్గంలో వెళ్లిన రెండు ఆర్టీసీ  బస్సులు  వరద నీటిలో చిక్కుకున్నాయి. అందులోని ప్రయాణికులను తాడు సాయంతో సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అన్నారం, మహబూబాద్ నుంచి వచ్చిన ఈబస్సుల్లో  సుమారు వంద ప్రయాణికులు  ఉన్నారు. దీంతో పోలీసులు మరో మార్గంలో వాహనాలను మళ్లించారు.