ఘన్పూర్  ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఆర్టీసీ బస్సు నడపాలి

పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు నుంచి బోరిగాం,మోపాల్,కులాస్ పూర్, ముల్లంగి,నుండి ఘన్ పూర్ వరకు ఆర్టీసీ బస్సు నడపాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రీజినల్ మేనేజర్ టి .జోష్న కు పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది....