Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 10:26 am Posted by : ramakrishna

స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు 

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : 

 

నిజామాబాద్ నగరంలోని స్టేషన్ రోడ్ లో స్కూల్ బస్సును ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది.నగరంలోని ఎస్ ఆర్ ప్రైమ్ స్కూల్ బస్సు విద్యార్థులతో పాఠశాలకు వెళుతుండగా కవిత కాంప్లెక్స్ ఎదురుగా బాన్సువాడ డిపో ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో స్కూల్ బస్సు ముందు భాగంలో స్వల్పంగా ధ్వంసం అయింది.ఈ ఘటనలో విద్యార్థులు ఎవరికి గాయాలు కాలేదు విద్యార్థులను వేరే వాహనంలో పాఠశాలకు తరలించారు ఈ మేరకు స్థానిక ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని ఆర్టీసీ ఆర్ఎం తదితర అధికారులు పరిశీలించారు.

RTC bus hits school bus