Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 July 2025, 12:48 pm Posted by : ramakrishna

ఆర్టీసీ బస్సు, టీవీఎస్ ఎక్సెల్ ఢీ : ఒకరు మృతి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో ఘటన

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో టీవీఎస్ ఎక్సెల్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్టేషన్  రోడ్డులో టీవీఎస్ ఎక్సెల్ ను ఢీ కొంది. ఈప్రమాదంలో తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పైడాకుల నారాయణ అనే వ్యక్తి మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.