Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2025, 1:48 pm Posted by : ramakrishna

మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపు

జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

దేశంలోనే తొలిసారి..

వెబ్ న్యూస్, బతుకమ్మ :   దేశంలోనే తొలిసారిగా  మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె రూ. 77, 220 ఆర్టీసీ చెల్లించనుంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది.


RTC allocates rented buses to women's groups