వాహనాలను తనిఖీలు చేసిన ఆర్టీఏ అధికారులు
నిజామాబాదు క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని ఖానాపూర్ చౌరస్తాలో ఆర్టీఏ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ వాహనాలు డీసీఎం, లారీలకు సంబంధించి పత్రాలను పరిశీలించారు. వాహనానికి సంబంధించి సరైన డాక్యుమెంట్స్ లేని, ఫిట్ నెస్ లేని వాహనాలకు జరిమానాలు విధించినట్లు ఎంవీఐ కిరణ్ కుమార్ తెలిపారు.