Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2025, 12:43 pm Posted by : ramakrishna

పీసీసీ చీఫ్ ను కలిసి ఆర్టీఏ మెంబర్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను ఆర్టీఏ మెంబర్ రాజ నరేందర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఆర్టీఏ సేవలు ప్రజలకు అందేలా చూడాలని  ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఆయనకు సూచించారు. కార్యక్రమంలో సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్, యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ మాజీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నగర యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ప్రీతం తదితరులు ఉన్నారు.