హిందూవుల సంఘటితం కోసం ఆర్ఎస్ఎస్ నిర్విరామంగా కృషి చేస్తుంది
ఆర్ఎస్ఎస్ సహా ప్రాంత ప్రచారక్ ప్రభుకుమార్ నిజామాబాద్, బతుకమ్మ : భారతమాతను విశ్వగురువు స్థానంలో నిలుపడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ హిందూవుల సంఘటితం కోసం నిర్వీరామంగా కృషి చేస్తోందని ఆర్ఎస్ఎస్ సహా ప్రాంత ప్రచారక్ ప్రభుకుమార్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ ఐటిఐలో కళాశాల విద్యార్థి శిభిరం సార్వజనికోత్సవ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుకుమార్ హాజరై మాట్లాడుతూ ప్రపంచమే ఆర్ఎస్ఎస్ సేవ గురించి చర్చించుకుంటుందని ఈ విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. స్వాతంత్ర్యం రాకపూర్వం హిందూ పదం...