Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2024, 9:04 pm Posted by : ramakrishna

హిందూవుల సంఘటితం కోసం ఆర్ఎస్ఎస్ నిర్విరామంగా కృషి చేస్తుంది

  • ఆర్ఎస్ఎస్ సహా ప్రాంత ప్రచారక్ ప్రభుకుమార్

నిజామాబాద్, బతుకమ్మ : భారతమాతను విశ్వగురువు స్థానంలో నిలుపడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ హిందూవుల సంఘటితం కోసం నిర్వీరామంగా కృషి చేస్తోందని ఆర్ఎస్ఎస్ సహా ప్రాంత ప్రచారక్ ప్రభుకుమార్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ ఐటిఐలో కళాశాల విద్యార్థి శిభిరం సార్వజనికోత్సవ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుకుమార్ హాజరై మాట్లాడుతూ ప్రపంచమే ఆర్ఎస్ఎస్ సేవ గురించి చర్చించుకుంటుందని ఈ విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. స్వాతంత్ర్యం రాకపూర్వం హిందూ పదం అనాలంటే ఆలోచించే వారని ప్రస్తుతం మార్పు రావడం మనం చూస్తున్నామన్నారు. సమాజంలో కొందరు హిందువులతో స్నేహం చేస్తునే ఎన్జీవోలు, వ్యక్తుల పేర్లతో హిందువుల మధ్య ఐక్యమత్యాన్నివిచ్చిన్నం చేసే కుట్ర పన్నుతున్నారన్నారు. ప్రధానంగా ఇప్పుడు ఒకవర్గం లౌజిహాద్, ల్యాండ్ జిహాద్, పాపులేషన్ జిహాద్ పేర్లతో హిందువుల అస్తిత్వానికి ముప్పుగా పరిణమించారన్నారు. మతమార్పిడిలను మరో వర్గం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఆర్ అండ్ బి సీఈ గజవాడ హనుమంతురావు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు ఇప్పటికి, ఎప్పటికి ప్రజల్లో నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల శిబిర సర్వాధికారి గజానన్, విభాగ్ సంఘచాలక్ ప్రతాప్, నగర ప్రచారక్ అర్గుల సత్యం తదితరులు పాల్గొన్నారు.

RSS works tirelessly for the unity of Hindus
. . . నగరంలో పథ సంచలన్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నగరంలో స్వయం సేవకులు పథ సంచలన్ నిర్వహించారు. ఘనవేష్ ధరించి దండ ప్రదర్శన చేస్తూ నగరంలో నలుమూలల నుంచి 2 వేల మంది స్వయం సేవకులు పథ సంచలన్ చేశారు. పథ సంచలన్ కు ప్రజలు స్వచ్చందంగా పూలుచల్లి స్వాగతం పలికారు. పథ సంచలన్ లో నగర ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణతో పాటు, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.

RSS works tirelessly for the unity of Hindus