Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 3:23 pm Posted by : ramakrishna

ఆర్ ఎస్ ఎస్ దేశ సమైక్యతకోసం నిర్విరామ కృషి చేస్తుంది

. . . ప్రధాన వక్త రాజుల్వర్ దిగంబర్ జి 

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

ఇందూరు నగరంలో శ్రీరామ్ ఉప నగరం లో సంఘ శతాబ్ది సంక్రాంతి ఉత్సవం జనార్ధన్ గార్డెన్ లో బుధవారం నిర్వహించారు. ఈ ఉత్సవంలో ప్రధాన వక్త గా విచ్చేసిన రాజుల్వర్ దిగంబర్ జి మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్ వందేళ్ల లో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి, దేశ సమైక్యతకోసం నిర్విరామ కృషి చేస్తున్నదని , శతాబ్ది వేడుకల్లో సంక్రాంతి పండుగ సామరసత సందేశాన్ని ప్రతి హిందువు కుటుంబానికి అందజేయాలని కోరారు. హిందూ సమాజం లో అంటరానితనం లేదని,రాముడు గుహుడితో స్నేహం చేయడం, శబరి ఎంగిలి తినడం,అరుంధతి నక్షత్రాన్ని చూడటం కూడా మన సమరసతా జీవనానికి దర్పణం అన్నారు.పంచ పరివర్తన ద్వారా సమాజ పరివర్తన కోసం పాటు పడాలని తెలిపారు. ఈకార్యక్రమం లో నగర కార్యవాహ అరుగుల సత్యం, సహ కార్యవాహ సుమిత్, అనిల్, అభిరామ్, శ్రవణ్, మృత్యుంజయ, నరేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.