Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2025, 8:02 pm Posted by : ramakrishna

దేశ వైభవానికి దిక్సూచి ఆర్ఎస్ఎస్

  • విభాగ్ శారీరక్ ప్రముఖ్ భద్రయ్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఆర్ఎస్ఎస్ ఈ దేశ వైభవానికి దిక్సూచి అని ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రముఖ్ భద్రయ్య అన్నారు. నగరంలోని గాజులపేట ఉప నగరం లో గల ఆనంద్ నగర్ లోని వశిష్ఠ మహర్షి శాఖ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్యోతి భద్రయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంఘ శాఖ సంస్కారానికి కేంద్రం బాల స్వయం సేవకులలో దేశభక్తి, క్రమ శిక్షణ, ఏకాగ్రత ఐకమత్యం లక్షణాలు వికసిస్తాయన్నారు. భారత దేశ అసలైన చరిత్రను అధ్యయనం చేసే అవకాశం శాఖలో మనకు లభిస్తుందని తెలిపారు. స్వయంసేవకులు దేశం కోసం ఎలాంటి త్యాగాలైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. సంఘ శాఖలో కుల భేదాలు లేకుండా అందరం హిందువులం ,తల్లి భారతి పిల్లలం అనే ఏకాత్మతా భావన వ్యక్తుల్లో పెంపొందుతుందన్నారు. కుంభమేళా లో కూడా స్వయం సేవకులు సేవ కార్యక్రమాలు చేశారు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో నగర కార్యవాహ సత్యం, సహ కార్యవాహ సుమిత్,అనిల్ ,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.