దేశంలో నివసించే వారంతా హిందువులే
– ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రత్యేక ఆమంత్రిత సభ్యులు రాంపల్లి మల్లికార్జున్
నిజామాబాద్, బతుకమ్మ : దేశ సమగ్రత కోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రత్యేక ఆమంత్రిత సభ్యులు రాంపల్లి మల్లికార్జున్ అన్నారు. దేశంలో నివసించే వారంతా హిందువులే నని ఆయన వ్యాఖ్యనించారు. ఆర్ఎస్ఎస్ ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య వక్త గా విచ్చేసి మాట్లాడారు. దేశము ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు హిందూ సంఘటన మాత్రమే సమాధానమని అన్నారు. మరో ముఖ్య అతిథి ప్రముఖ ఎముకల వైద్యులు డాక్టర్ అంకం గణేష్ మాట్లాడుతూ మహోన్నతమైన చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ వేదిక మీద తాను భాగం పంచుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. 100 సంవత్సరాల వేడుక జరుపుకుంటున్న వేళ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాననీయ జిల్లా సంఘచాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం, తదితరులున్నారు.
