కాంగ్రెస్ అభ్యర్థి కేతావత్ సురేఖకు ఆర్ఎస్పి మద్దతు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా దేశంలో పెరుగుతున్న మతోన్మాద శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆర్ఎస్పీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా కన్వీనర్ కటారి రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో గత పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నగరాన్ని సమస్యల నిలయంగా మార్చారని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితి, మంచినీటి కొరత, మురికి కాలువల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని అన్నారు. ప్రజల మౌలిక...