నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించాలని పీడీఎస్ యూ తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి కే.గౌతం రాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ ఎదుట గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ యూనివర్సిటీని సీఎం సందర్శించాలని కోరారు, ఇంటిగ్రేటెడ్, పీజీ విద్యార్థులకు నెలకు రూ. 2000 ఫెలొషిఫ్స్ ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి అమలు చేయాలని,యూనివర్సిటీ లో నూతన వృత్తి విద్య కోర్సులను తీసుకురావాలనీ ,యూనివర్సిటీ విద్యార్థుల మెస్ బకాయిలను రద్దు చేయాలనీ డిమాండ్ చేయారు. అలాగే ఖాళీగా ఉన్న అసిస్టెంట్,అసోసియేట్,ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని,గర్ల్స్ హాస్టల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఖాళీగా ఉన్న పీహెచ్ డీ సీట్లను భర్తీ చేయాలనీ, పరిశోధన విద్యార్థులకు నూతన హాస్టల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ పీడీఎస్ యూ నాయకులు హనుమండ్లు, సాయి కుమార్,దేవేందర్,తిరుపతి,సాయి,రాజు,సంతోష్, సాయి కిరణ్,రాకేష్,సురేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.