Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 January 2025, 4:02 pm Posted by : ramakrishna

అత్తకు రూ.4వేలు.. కోడలికి రూ.2500.. ఆడపడుచుకు తులం బంగారం ఎక్కడ..?

బతుకమ్మ, వేల్పూర్ : ఆరు గ్యారంటీలు 420హామీలు ఇచ్చి ఆదికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎం చేసిందో చెప్పాలని బాల్కొండ నియోజకవర్గ బి ఆర్ ఎస్ నాయకులు అన్నారు. 10పార్టీలు మారి రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసిన సునీల్ కుమార్ కి ప్రజలు ఆధరించలేని అలాంటి వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా బాల్కొండ ప్రజలు గెల్పించిన నాయకుడి మీద మాట్లాడటం సరికాదన్నారు. మంత్రిగా బాల్కొండ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన నాయకుడు ప్రశాంత్ రెడ్డి అని, అభివృద్ధి అంటే ప్రజలకు మంచి చేయాలని, మీలాగా ఇసుక మాఫియను అభివృద్ధి చేస్కోవడం కాదని అన్నారు. 10 సంవత్సరాల కాలంలో ప్రశాంత్ రెడ్డి ఏ అన్యాయం చేసారో నిరూపించాలని, ఊరికే మాట్లాడితే సిపాయిలు కాలేరని విమర్శించారు. బి ఆర్ ఎస్ కాలంలో 80శాతం సీఎంఆర్ఎఫ్ ఇస్తే మీరు 20శాతం కుడా ఇస్తలేరని ఎద్దేవా చేశారు. పోలీస్ సెక్యూరిటీ ల మధ్య గ్రామ సభలను నడుపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు.  ప్రజలు వ్యతిరేకస్తున్నారు అన్న మాట స్థానిక ఎలక్షన్స్ లో ఏర్పాడుతుంది ఎవరిని వ్యతిరేకుస్తున్నారో మోహన్ రెడ్డి గుర్తేరగాలని సూచించారు. ఈ కార్యక్రంలో డి సి సి బి డైరెక్టర్ శేఖర్ రెడ్డి, మోర్తాడ్ మండల్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు ఏలీయా, కమ్మరపల్లి మండల అధ్యక్షుడు దేవేందర్, వేల్పూర్ మండల అధ్యక్షుడు నాగదర్ రెడ్డి, పూర్ణ నందు, రేగుల రాములు, మహేష్, మహిపాల్, ఉపేందర్, రవి, నర్సయ్య, డోళ్ళ రాజేశ్వర్, మైనారిటీ నాయకుడు మొయిస్, బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.