గద్దర్ ఫౌండేషన్ కు రూ.3 కోట్లు మంజూరు

హైదరాబాద్, బతుకమ్మ : గద్దర్ ఫౌండేషన్ కు ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. గ‌ద్దర్ జ‌యంతి వేడుక‌ల్లో ఫౌండేష‌న్‌కు భాగ‌స్వామ్యం కల్పించనుంది. ప్రజాయుద్ధ నౌక గ‌ద్దర్ ఆలోచ‌న‌లు, ఆయ‌న ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ్లేందుకు గానూ గ‌ద్దర్ ఫౌండేష‌న్‌కు ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది.ఫౌండేష‌న్‌కు అవ‌స‌ర‌మైన నిధులు కేటాయిస్తామ‌ని గ‌తంలో రేవంత్ హామీ ఇచ్చారు.  ఇక ముందు గ‌ద్దర్ జ‌యంతి వేడుక‌ల కార్యక్రమాల నిర్వహణలోనూ గ‌ద్దర్ ఫౌండేష‌న్‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తూ మ‌రో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. నేడు గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్...