ఇందల్ వాయి, బతుకమ్మ :
శివగంగ కేదార్ నాథ్ విశ్వేశ్వర ఆలయ గుడి నిర్మాణం కొరకు విరాళాలు సేకరిస్తున్న తరుణంలో నల్లవెల్లి వాసులు కేదార్ నాథ్ సంతోష్ మహారాజ్ కి రూ.26025 లను చందా రూపంలో అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శివయ్య ఆశీర్వాదాలు ప్రజలందరికీ ఉండాలని త్వరలోనే గుడి నిర్మాణం పూర్తయ్యేలా శివయ్య భక్తులు సహకరించాలని సర్పంచ్ ల పోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్ కోరారు. భవిష్యత్ కాలంలో కేదార్ నాథ్ విశ్వేశ్వర ఆలయం ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిందిగా, పర్యాటక రద్దీగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందల్ వాయి తాండ నాయక్ సౌమ్య నాయక్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు ఇందల్ వాయి తాండ గ్రామ సర్పంచ్ సుదర్శన్ నాయక్, ఉప సర్పంచ్ బాలు, మాజీ సర్పంచ్ చందర్ నాయక్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ చందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వసంత్ రావు, శంకర్, బలిరాం, రవి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.