కరూర్ మృతులకు రూ. 20 లక్షలు : విజయ్

వెబ్ న్యూస్, బతుకమ్మ :    తమిళనాడులోని  కరూర్ తొక్కిసలాట ఘటన మృతులకు నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్  నష్ట పరిహారం ప్రకటించారు.  మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు,  క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.  క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈమేరకు ’ఎక్స్‘ వేదికగా విజయ్ ట్వీట్ చేశారు.