Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2025, 12:03 pm Posted by : ramakrishna

ఏటీఎం నుంచి రూ. 20 లక్షల చోరీ

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఘటన

హుజూర్ నగర్, బతుకమ్మ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని ఓ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. లింగగిరి రోడ్ లో ఉన్న ఎస్ బీఐ ఏటీఎంలోకి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు ప్రవేశించారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి రూ.20 లక్షల నగదును అపహరించారు. అనంతరం నిప్పటించడంతో ఏటీఎం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.


Rs. 20 lakh stolen from ATM