Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2025, 4:38 pm Posted by : ramakrishna

రూ. 2లక్షల ఎల్ఓసీ అందజేత

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బడా భీమ్ గల్ గ్రామానికి చెందిన హనుమండ్లు నడవలేని పరిస్థితిలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుండగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించడంతో ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం రూ. 2లక్షల ఎల్ఓసీ ని బాధితునికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి విషయాన్ని వివరించగా వెంటనే స్పందించిన ఆయన ఎల్ ఓ సీ ని మంజూరు చేయించారు. దాంతో బాధితుని కుటుంబీకులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.