పెన్షన్ చెల్లింపులో రూ.16 స్వాహా..
ఆవేదన వ్యక్తం చేస్తున్న పెన్షన్ దారులు రుద్రూర్, బతుకమ్మ : పోస్టాఫీసులో ప్రతినెల ఇచ్చే పెన్షన్ లో 16 రూపాయలు ఇవ్వడం లేదంటూ పెన్షన్ తీసుకుంటున్న బాధితులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం ప్రతి నెల వృద్ధులకు, వితంతువులకు 2,016 రూపాయలు, వికలాంగులకు 4,016 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పోస్టాఫీసులో విధులు నిర్వహించే ఔట్సోర్సింగ్ సిబ్బంది ఫించన్ లబ్ధిదారులకు 2,000, 4,000 రూపాయలు ఇచ్చి, చిల్లర 16 రూపాయలను తన జేబులో వేసుకుంటున్నారని...