Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2025, 6:25 pm Posted by : ramakrishna

పెన్షన్ చెల్లింపులో రూ.16 స్వాహా..

  • ఆవేదన వ్యక్తం చేస్తున్న పెన్షన్ దారులు

 

రుద్రూర్, బతుకమ్మ : పోస్టాఫీసులో ప్రతినెల ఇచ్చే పెన్షన్ లో 16 రూపాయలు ఇవ్వడం లేదంటూ పెన్షన్ తీసుకుంటున్న బాధితులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం ప్రతి నెల వృద్ధులకు, వితంతువులకు 2,016 రూపాయలు, వికలాంగులకు 4,016 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే  గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పోస్టాఫీసులో విధులు నిర్వహించే ఔట్సోర్సింగ్ సిబ్బంది ఫించన్ లబ్ధిదారులకు 2,000, 4,000 రూపాయలు ఇచ్చి, చిల్లర 16 రూపాయలను తన జేబులో వేసుకుంటున్నారని పెన్షన్ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా లబ్దిదారుడు చిల్లర ఎందుకు ఇవ్వడం లేదని పోస్టు ఆఫీస్ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నిలదీస్తే చిల్లర డబ్బులు లేవని.. నీ దగ్గర చిల్లర డబ్బులు ఉంటే తీసుకుని రా.. లేకపోతే నేను ఇచ్చిన డబ్బులే తీసుకొని పోవాలంటున్నారాన్ని పింఛన్ లబ్ధిదారులు వాపోతున్నారు. మండల వ్యాప్తంగా ఇంత పెద్ద మొత్తంలో ఆసరా పెన్షన్ దారుల నుండి డబ్బులు స్వాహా చేస్తున్నా కూడా మండల, జిల్లా అధికారులు స్పందించకపోవడం అవినీతికి ఊతం ఇస్తున్నట్లే అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆసరా పెన్షన్‌దారులు కోరుతున్నారు.