- పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు
బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కొత్తగా ఏర్పాటైన నూతన మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు గ్రామాలకు గాను 15 కోట్లు మంజూరు అయ్యాయని వాటిని షాపింగ్ కాంప్లెక్స్ ల కొరకు రెండు కోట్ల రూపాయలు, డ్రైనేజ్ ల నిర్మాణం కొరకు 3.5 కోట్ల రూపాయలు, సీసీ రోడ్ల నిర్మాణం కొరకు ఐదు కోట్ల రూపాయలు, కల్వర్టుల నిర్మాణం కొరకు 1.5 కోట్ల రూపాయలు ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణం కొరకు మూడు కోట్ల రూపాయలు వెచ్చించనున్నామని ఆయన తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ కొరకై నిధులు మంజూరు చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్, సంతోష్ అప్ప, శాఖాపూర్ తుకారం, సహిల్ శేట్కర్, నౌషా నాయక్, యోగేష్ మంచివార్, సాయిని అశోక్, సీమ గంగారం తదితరులు పాల్గొన్నారు.
