Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 5:10 pm Posted by : ramakrishna

599 పేకాట రాయుళ్ల అరెస్ట్

  • రూ.14,15,917 నగదు స్వాధీనం
  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్బంగా ఈనెల 19నుంచి 22 వరకు పేకాట ఆడుతున్న 599మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వారి వద్ద నుంచి రూ.14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం 138 కేసులు నమోదు చేసి రూ.14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  నిజామాబాద్ డివిజన్ లో పరిధిలో 42 కేసులు నమోదు చేసి 180మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.5,13,402 నగదు స్వాధీనం చేసున్నట్లు తెలిపారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 44 కేసులు నమోదు చేసి 232 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.5,51,785 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బోధన్ డివిజన్ పరిధిలో 52 కేసులు నమోదు చేసి, 187 మందిని అరెస్ట్ చేసి రూ.3,50,730 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.