Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 8:45 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే కృషితో గ్రామాలలో సీసీ రోడ్ల కు రూ.14.50 కోట్ల నిధులు మంజూరు

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

మారుమూల ఎల్లారెడ్డి కాదుమోడల్ ఎల్లారెడ్డి గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవతో గ్రామాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. నియోజకవర్గంలోని గ్రామాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ముఖ్యంగా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో రూ.14.50 కోట్ల నిధులను సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కీలక పాత్ర పోషించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా మండల స్థాయి నుండి జిల్లా అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే కృషి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నిధులతో నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి, నాగిరెడ్డిపేట్, సదాశివనగర్, తాడ్వాయి, రాజంపేట, రామారెడ్డి మండల పరిధిలోని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిని మరింత వేగవంతం చేసుకునేలా అవకాశం కల్పిస్తూ, ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలోనే గ్రామీణ సీసీ రోడ్ల నిర్మాణానికి రికార్డు స్థాయిలో నిధులు తీసుకురావడం ఎమ్మెల్యే మదన్ మోహన్ అభివృద్ధి సంకల్పానికి నిదర్శనం అని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సౌకర్యాల పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ కు నియోజకవర్గ ప్రజలు, గ్రామ సర్పంచులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Rs. 14.50 crores sanctioned for CC roads in villages due to MLA's efforts