Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 February 2025, 2:27 pm Posted by : ramakrishna

ఏనుగుల దాడి మృతులకు  రూ.10 లక్షల నష్ట పరిహారం

వెబ్ న్యూస్,బతుకమ్మ :  ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఏనుగులగుంపు దాడి భక్తులపై దాడి చేసింది. ఈఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. మృతులను ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వంకాయల దినేష్ (34),  తుపాకుల మణెమ్మ (40),  తిరుపతి చంగల్ రాయుడు (35) లుగా గుర్తించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె మండల పరిధిలోని గుండాల కొనలో ఉన్న శివాలయానికి శివరాత్రి సందర్భంగా భక్తులు వెళ్తున్నారు. సోమరాత్రి 14 మంది భక్తులు అటవీ మార్గంలో వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. దాడి నుంచి 8 మంది భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.  మహాశివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారంగా ఒక్కొక్కొరికి రూ.10 లక్షలు, క్షత్రగాత్రులకు  రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.