స్కూటీ డిక్కీలో నుంచి రూ. లక్ష అపహరణ
బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో సోమవారం స్కూటీ డిక్కీలో నుంచి రూ. లక్ష అపహరణకు గురైన ఘటన వెలుగు చూసింది. తాడ్కోల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో సాయిరెడ్డి బ్యాంకులో నుంచి రూ. లక్ష డ్రా చేసి స్కూటీ డిక్కీలో పెట్టుకున్నాడు. ఓ దుండగుడు బ్యాంకు నుంచి గమనిస్తూ సాయిరెడ్డి వెనుక వెళ్లాడు. కూరగాయలు కొనుగోలు చేస్తున్న సమయంలో డిక్కీలో నుంచి రూ. లక్ష మాయం చేశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు...