Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2025, 12:53 pm Posted by : ramakrishna

తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ లో రూ. 1.20 కోట్లు మాయం

మాజీ సంయుక్త కార్యదర్శి ఫిర్యాదు

స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అందించిన నిధులు స్వాహా చేశారని ఆరోపణలు

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ లో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయని  జాతీయ కబడ్డీ క్రీడాకారుడు. మాజీ సంయుక్త కార్యదర్శి తోట సురేశ్ ఆరోపించారు. ఈమేరకు ఆయన హైదాదాద్ లోని అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కె. జగదీష్ యాదవ్, కోశాధికారి కె.బి. శ్రీరాములుపై తీవ్రమైన ఆరోపణలను సురేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, సురేశ్ ఆరోపణలు అసోసియేషన్ లో సంచలనం రేపుతున్నాయి. అసోసియేషన్ కు అధికారికంగా ఒకే బ్యాంక్ ఖాతా ఉన్నప్పటికి,అనధికారికంగా  మరో ఖాతా ఓపెన్ చేసి రూ. 60 లక్షలు విత్ డ్రా చేశారని, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అందించిన నిధులను సైతం మళ్లించారని ఆరోపించారుజ 2021 లో నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ కోసం విడుదలైన రూ.1.20 కోట్లలో రూ. 50లక్షలను ఎలాంటి అనుమతి తీసుకోకుండనే వాడుకున్నారని సురేశ్ తెలిపారు.