బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలో గురువారం రాత్రి రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. రౌడీ షీటర్ అబ్బు పాత బస్టాండ్ లో హల్చల్ చేయడంతో మున్సిపల్ కార్మికుడు ఎల్లయ్య గాయపడ్డాడు. పెద్ద ఎత్తున ప్రజలు బస్టాండ్ వద్ద గుమిగూడారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను చెదర గొట్టారు.రౌడీ షీటర్ అబ్బును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
