మోర్తాడ్, బతుకమ్మ: వరదల వల్ల డబుల్ బెడ్ రూంలలో నివాసం ఉన్న పేదల పట్ల ప్రభుత్వ అధికారులు అనుచితంగా ప్రవర్తించిన వారిపట్ల ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో వర్షాల మూలంగా జరిగే ప్రమాదం భారీ నుండి రక్షించుకోవడం కోసం ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూంలో నిరుపేదలు నివాసమున్న వారి పట్ల ప్రభుత్వ అధికారులు పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి సీపీఐఎంఎల్ ప్రజాపంథా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కమిటీ కార్యదర్శి ప్రభాకర్, మోర్తాడ్ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకులు ఆనంద్ లు మాట్లాడుతూ అర్హులైన పేదలకు, ఇల్లు లేని పేదలకు త్వరలో డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి. బి. దేవారం. అఖిల భారత ఐక్య రైతు సంఘం. జిల్లా అధ్యక్షులు కార్యదర్శి. సురేష్. భాగన్నగారి బాబన్న… ప్రజాపంథా కమ్మర్పల్లి కార్యదర్శి. అశోక్. ఎమ్మార్పీఎస్ రవి. దయాల్ సింగ్. శ్రీనివాస్.భూమగంగు. పద్మ. గంగపోసాని. తదితరులు పాల్గొన్నారు.