కుళ్లిన గుడ్లు.. పాడైన పౌష్టికాహారం

. అంగన్ వాడీ కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం . మాగి సెంటర్ లో చిన్నారులు, బాలింతలకు ఇబ్బందులు నిజాంసాగర్, బతుకమ్మ: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం, ఉన్నతాధికారులు మొత్తుకుంటున్నా క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిజాంసాగర్ మండలం మాగి అంగన్ వాడీ సెంటర్ లో చిన్నారులు, బాలింతలకు కుళ్లిన గుడ్లు, పాడైన పౌష్టికాహారాన్ని అందించారు. ఇదేమిటని ఓ యువకుడు నిలదీస్తే తమకు వచ్చినవి ఇస్తున్నామని సెంటర్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ ఘటన అంగన్ వాడీ సెంటర్లలో నిర్లక్ష్యం, అవినీతి...