- అంగన్వాడీ సిబ్బందిని ప్రశ్నించిన యువకుడు
- పై నుంచి ఇలాగే వచ్చాయని సమాధానం
నిజాంసాగర్, బతుకమ్మ : అంగడి వాడి సెంటర్లో కుళ్ళిపోయిన గుడ్లను, పాడైపోయిన పౌష్టికా ఆహార పదార్థాలు పిల్లలకు, బాలింతలకు అందజేయడంతో ఓ యువకుడు ఇదేంటని ప్రశ్నిస్తే పై నుండి ఇలాగే వచ్చినయి అవే ఇస్తున్నామంటూ సమాధానం చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో బాలింతలకు, చిన్నారులకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పోషకాహార పదార్థాలతో పాటు , గుడ్లను అందిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం చెడిపోయిన పౌష్టికాహారాలు, కుళ్ళిపోయిన గుడ్లను బాలింతలకు అందజేయడంతో అంగన్వాడి సెంటర్ నిర్వాహకురాలు ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా, కాలం చెల్లిపోయిన పౌష్టిక ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుందని ఈ విషయంపై ఓ యువకుడు అంగన్వాడి నిర్వాహకురాలను ప్రశ్నించగా ప్రభుత్వం నుండి వచ్చిన గుడ్లను, కాలం చెల్లిపోయిన పౌష్టికాహారాలను అందిస్తున్నానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అంగన్వాడి సెంటర్లలో ఎంత దారుణంగా అవినీతి జరుగుతుందో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. మొన్నటికి మొన్న నిజాంసాగర్ మండల మండల కేంద్రంలోని బంజపల్లి అంగన్వాడి సెంటర్ లో కూడా ఇలాంటి తతంగం వెలుగులోకి వచ్చింది. అయినా ఉన్నంత అధికారులు మాత్రం తనకేమి పట్టనట్లు వివరిస్తూ , బాలింతల, చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్న ఇలాంటి సంఘటనలు మరెన్నో జరుగుతున్నా యి. ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అంగన్వాడి సెంటర్లపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్న అంగన్వాడి నిర్వాహకురాలు పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒక బంజాపల్లి మాగి గ్రామంలోనే కాదు ఉమ్మడి నిజాంసాగర్ మండల కేంద్రాలతో పాటు, ఆయా గ్రామాల అంగడి వాడి సెంటర్లలో ఇష్టానుసారంగా పూర్తి నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ, మరికొందరు అంగన్వాడి టీచర్లు ఆయమ్మ లతో పని చేపిస్తూ విరు మాత్రం దర్జాగా ఇండ్లలోనే ఉండి పని చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అంగన్వాడీ కేంద్రాల పై దృష్టి సారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.