Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2024, 5:55 pm Posted by : ramakrishna

నేడు నగరంలో రోటరీ గవర్నర్ పర్యటన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రోటరీ జిల్లా 3150 గవర్నర్(తెలంగాణ ఆంధ్ర రీజియన్ ప్రాంతాల 100 క్లబ్బుల నకు సంబంధించిన) రో. శరత్ చౌదరి తన అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నకు విచ్చేసి ఉదయం 12 గంటల ప్రాంతంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోటరీ గ్లోబల్ గ్రాంట్ సహకారంతో ఏర్పాటుచేసిన 28.30 లక్షల వెల గల నూతన డిజిటల్ రేడియోగ్రఫీ వ్యవస్థ ప్రారంభిస్తారని తదనంతరం పత్రిక పాత్రికేయులతో చర్చ గోష్టి ఏర్పాటు చేసినట్లు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు బిరెల్లి విజయరావ్ ప్రకటన ద్వారా తెలిపారు. అటు పిమ్మట నాలుగు గంటల 30 నిమిషాలకు స్థానిక జిజీ కాలశాల వద్ద నూతనంగా రోటరీ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారని సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు నాల్కల్ రోడ్డు నందుగల రోటరీ సర్వీస్ ట్రస్టులో పబ్లిక్ మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారని పత్రిక ప్రకటన లో తెలిపారు.