నిజామాబాద్, బతుకమ్మ: ఓ కుటుంబాన్ని వేధించి తండ్రీకూతురి ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ పరిధిలోని కంఠేశ్వర్ మండల అధ్యక్షుడు రోషన్ లాల్ బోరాను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి గురువారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ పటిష్టతకు భంగం కలిగించేలా వ్యవహరించిన కారణంగా రోషన్ పై సస్పెన్షన్ వేటు వేశామని, ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.