చారిత్రక మార్పు దిశగా ఆర్ఓఆర్ చట్టం

 జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు   రుద్రూర్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి' నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని, రైతుల మేలు కోసం చారిత్రక మార్పు దిశగా ఆర్.ఓ.ఆర్ చట్టం ఉపకరిస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి నూతన చట్టంపై రైతులకు శనివారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు పాల్గొని...